Site icon NTV Telugu

కేసీఆర్‌పై మాజీ ఎంపీ ఫైర్‌.. డేంజరస్ ఫెలో..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు మాజీ ఎంపీ రవీందర్ నాయక్.. దళిత బంధు ప‌థ‌కాన్ని స్వాగ‌తించిన ఆయ‌న‌.. వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లు ఉంది కేసీఆర్ వైఖ‌రి అంటూ ఎద్దేవా చేశారు. దళిత గిరిజనులను… తెలంగాణ పేదలను మోసం చేసి హుజురాబాద్ లో గెలిచేందుకు ఈ జిమ్మిక్కులు చేస్తున్నార‌ని ఆరోపించిన ఆయ‌న‌.. కేసీఆర్ ఓ చీటర్.. ఏడేళ్లుగా అందరినీ మోసం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.. తెలంగాణ మేధావులు. రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాల‌ని సూచించిన ఆయ‌న‌.. ఇక‌, హుజురాబాద్ లో దళిత బంధు తీసుకోవాలి.. ఆ తరువాత ఆయనకు బుద్ధి చెప్పాలి.. అప్పుడే రాష్ట్రంలో మిగిలిన దళితులకు.. గిరిజనులు.. పేదలకు న్యాయం చేస్తార‌ని సూచించారు.

ఏడున్నర ఏళ్లుగా దళిత.. గిరిజనులకు కేటాయించిన డబ్బులే ఇప్పుడు ఇస్తున్నార‌ని విమ‌ర్శించారు ర‌వీంద్ర‌నాయ‌క్.. 20 ల‌క్ష‌ల కోట్ల బడ్జెట్ లో 60వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఉంటాడు అని కామెంట్ చేసిన ఆయ‌న‌.. కేసీఆర్ సీఎం అయ్యాక పేద‌ల‌కు చేసిందేమీ లేదు.. కానీ, తన కుటుంబానికి మాత్రం ఫాం హౌజ్ లు.. భూములు కొన్నారు.. పదవులు ఇచ్చుకున్నార‌ని.. అధికారం నిలబెట్టుకునేందుకు మాత్రమే కేసీఆర్ పని చేస్తార‌ని ఎద్దేవా చేశారు. తనకొడుకును ముఖ్యమంత్రి చేయడం.. చివ‌ర‌కు మనువన్ని కూడా కేసీఆర్ గెలిపించుకుంటార‌ని కామెంట్ చేసిన ఆయ‌న‌.. ధనదాహం తీర్చుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టార‌ని మండిప‌డ్డారు.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దారి మ‌ళ్లించార‌ని ఆరోపించిన బీజేపీ నేత‌.. తాండాలను పంచాయతీలు చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టార‌ని.. అక్కడ బడ్జెట్ లేదు.. నిధులు ఇవ్వలేదు.. ఇక‌, జిల్లా పరిషత్ నిధులు35 వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయ‌లేద‌ర‌ని విమ‌ర్శించారు. ఏదీ చేయకుండా.. ఏదో చేసినట్లు నటిస్తాడు కేసీఆర్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ర‌వీంద్ర‌నాయ‌క్.. పోడు భూముల రైతులను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ ను తన్ని తరిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు.

హుజూర్‌న‌గ‌ర్‌లో 40రోజుల పాటు గిరిజనుల ను జైలులో పెట్టించార‌ని మండిప‌డ్డారు ర‌వీంద్ర నాయ‌క్.. ఎస్టీ కమిషన్ ను ఎందుకు సపరేట్ చేయలేదు? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎందుకు చేయడం లేదు? అని నిల‌దీశారు.. 10 శాతం రిజర్వేషన్లు ఇస్తా అని తూతూమంత్రంగా బిల్లు పాస్ చేసారు.. దానికి రాజ్యాంగ సవరణ అవసరం అన్నారు. చేతివృత్తుల ఏ కార్పొరేషన్ లో నిధులు లేవు.. నిర్వీర్యం చేసారు.. ఉప ఎన్నికలు వస్తే గొర్రెలు, బ‌ర్రెల పంపిణీ అంటూ ప్రకటిస్తున్నారు.. కాపలా కుక్క లా ఉంటా అన్నాడు.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. అభివృద్ధి చేసి ఉంటే హుజురాబాద్ లో ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నావు కేసీఆర్? అస‌లు కేసీఆర్ కు ఈటల రాజేంద‌ర్‌ను చూసి భయం పుట్టుకొచ్చింద‌ని కామెంట్ చేశారు. ఈబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.. కానీ, రాష్ట్రంలో అమలు చేయడం లేద‌న్న ఆయ‌న‌.. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిస్తున్నాడు అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ డేంజరస్ ఫెలో.. ఆయనను రాజకీయంగా కొట్టి బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు.

Exit mobile version