Site icon NTV Telugu

Akula Lalitha: బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా.. సీఎంకు లేఖ..!

Akula Lalitha

Akula Lalitha

Akula Lalith: నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత జిల్లా పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార సంఘం చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పరిపాలన సాగిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాలు తనను ఇబ్బంది పెడుతుండడంతో బీఆర్‌ఎస్‌ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆకుల లలిత ఎన్నికల అనంతరం బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార పార్టీని వీడి సొంత ఇంట్లో చేరుతార‌న్న వ‌ర్గాలు తాజాగా ఊపందుకున్నాయి. అక్టోబర్ 20 నుంచి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ పర్యటన నేపథ్యంలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

2008 ఉప ఎన్నికల్లో ఆకుల లలిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2015 తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆకుల లలిత ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2021, డిసెంబర్ 24న తెలంగాణ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఆకుల లలిత బాధ్యతలు స్వీకరించారు. అయితే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై అసంతృప్తితో ఉన్న ఆకుల లలిత మళ్లీ కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
MLA Laxma Reddy: రేపే జడ్చర్లలో కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ.. ఏర్పాట్లు పరిశీలించిన లక్ష్మారెడ్డి

Exit mobile version