Akula Lalitha: బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా.. సీఎంకు లేఖ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akula Lalith: నిజామాబాద్ బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత జిల్లా పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార సంఘం చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పరిపాలన సాగిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాలు తనను ఇబ్బంది పెడుతుండడంతో బీఆర్‌ఎస్ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆకుల లలిత ఎన్నికల అనంతరం బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీని వీడి సొంత ఇంట్లో చేరుతారన్న వర్గాలు తాజాగా ఊపందుకున్నాయి. అక్టోబర్ 20 నుంచి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ పర్యటన నేపథ్యంలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
2008 ఉప ఎన్నికల్లో ఆకుల లలిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2015 తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆకుల లలిత ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2021, డిసెంబర్ 24న తెలంగాణ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఆకుల లలిత బాధ్యతలు స్వీకరించారు. అయితే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై అసంతృప్తితో ఉన్న ఆకుల లలిత మళ్లీ కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
MLA Laxma Reddy: రేపే జడ్చర్లలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ.. ఏర్పాట్లు పరిశీలించిన లక్ష్మారెడ్డి
తాజావార్తలు
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!