Site icon NTV Telugu

టి-కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే ప్రకటన వచ్చిన కాసేపటికే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శనివారం రాత్రి లేఖ పంపారు.
ఇక టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. పార్టీలో చిన్ని చిన్న విభేదాలు సహజమేనని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని చెప్పారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం.. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version