Site icon NTV Telugu

Footpath Encroachment : బండ్లగూడలో ఫుట్‌పాత్‌పై వెలసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Hydraa

Hydraa

Footpath Encroachment : రంగారెడ్డిలోని బండ్లగూడలో మునిసిపల్ అధికారులు ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా ఝుళిపించారు. ఫుట్ పాత్‌పై వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పాదచారులు నడిచే పుట్ పాత్ ను ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు వ్యాపారస్తులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదేశాల మేరకు బండ్లగూడ జాగీర్ మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫుట్ పాత్ కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫుట్ పాత్ కబ్జా చేయడంతో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోడ్డుపై అడ్డంగా వాహనాలు నిలపడంతో తరుచూ భారీ గా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఫుట్ పాత్ కబ్జా చేయడంతో పాదచారుల పైకి వాహనాలు దూసుకొని వెళ్లిన ఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదం లో పలువురు మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి. దీని పై సీరియస్ అయిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. అక్రమంగా వెలసిన నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేతలు చేపట్టారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

Exit mobile version