Site icon NTV Telugu

డ్ర‌గ్స్ కేసులో కీల‌క మ‌లుపు.. పోలీసుల అదుపులో టోనీ ప్రధాన అనుచరుడు..

డ్రగ్స్ కేసులో కీల‌క మ‌లుపు తిరిగింది.. ఇప్ప‌టికే కీల‌క విష‌యాలు బ‌హిర్గ‌తం అయ్యాయి.. స్టార్ బాయ్ ఎక్కడివాడు కోణంలో దర్యాప్తు సాగుతోంది.. హైదరాబాద్‌లో స్టార్ బాయ్ మకాం వేసినట్లు.. ముంబై, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలకు డ్రగ్స్ విక్ర‌యించిన‌ట్టు పోలీసులు గుర్తించారు.. స్టార్ బాయ్ నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్‌లు టోనీ తీసుకున్న‌ట్టుగా తేల్చారు.. అండర్ గ్రౌండ్‌లో ఉండి స్టార్ బాయ్‌ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న‌ట్టు కూడా గుర్తించారు.. 8 ఏళ్ల నుంచి డ్రగ్స్ విక్ర‌యిస్తున్న‌టుగా కూడా పోలీసులు వెలికి తీశారు.. మ‌రోవైపు.. టోనీ ప్రధాన అనుచరుడు అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..

Read Also: 1.42 మిలియ‌న్ల నుంచి వేల‌లోకి ప‌డిపోయిన భారత పర్యాటకుల సంఖ్య

అఫ్తాబ్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.. టోనీ హైద‌రాబాద్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాలు, లావాదేవీల‌ను మొద‌టి నుంచి కూడా అఫ్తాబ్ ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్టుగా తేల్చారు.. హైద‌రాబాద్ క‌స్ట‌మ‌ర్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుని.. వారికి అఫ్తాబ్‌ డ్రగ్స్ అందించిన‌ట్టు గుర్తించారు.. అఫ్తాబ్ అకౌంట్‌లో కొన్నిరోజుల వ్యవధిలోనే కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు.. ఇక‌, అఫ్తాబ్ అకౌంట్ కు డబ్బులు పంపినవారి వివ‌రాల‌ను కూడా సేక‌రించే ప‌నిలో ప‌డిపోయారు పోలీసులు.. అఫ్తాబ్ ఫోన్ సీజ్ చేసి పోలీసులు.. అత‌డి ఫోన్ కాల్స్, మెస్సేజెస్, సోషల్ మీడియా కాన్వర్సెషన్స్ తో పాటు కంటాక్టుల‌ను కూడా ప‌రిశీలించే ప‌నిలో ప‌డిపోయారు.

Exit mobile version