Hens Death : భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. పట్టణాల్లో కాలనీలు చెరువుల్లాగా కనిపిస్తున్నాయి. నిజాంపేట (మం) నందిగామ గ్రామం నీట మునిగింది. ఈ గ్రామంలోని పౌల్ట్రీ ఫాంలోకి భారీగా వరద నీరు చేరింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఫాంలోని సుమారు 10 వేల కోళ్లు నీటిలో మునిగి చనిపోయాయి. సుమారు 14 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు పౌల్ట్రీ ఫారం యజమాని చెబుతున్నారు.
Read Also : Gadchiroli : గడ్చిరోలిలో నలుగురు మావోయిస్టులు హతం..
అనుకోకుండా ఒకేసారి వరద నీరు రావడంతో ఏమీ చేయలేకపోయామంటున్నారు ఫాం నిర్వాహకులు. ఎంతో కష్టపడి కోళ్ల ఫాం పెడితే ఇలా జరిగిందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు. మెదక్ జిల్లాలోని చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గేదెల షెడ్లు కూడా చాలా వరకు మునిగిపోయాయి. కొందరు రైతులు గేదెలను మేపడానికి వెళ్లి వరదల్లో చిక్కుకుంటున్నారు. అధికారులు రంగంలోకి దిగి చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
Read Also : Kamareddy : కామారెడ్డిలో భారీ వర్షాలు.. రైళ్ల రాకపోకలు రద్దు..
