Flexis War BRS:: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గు మన్నాయి. ఇవాళ జరగాల్సిన నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణస్వీకారానికి ముందే ఏర్పాటు ఫెక్సీలను చింపుకొని వీధిన పడ్డారు. రోడ్ల పైనే పరస్పరం వాగ్వివాదాలకు దిగడం కలకలం రేపింది.
నిడమనూరు, త్రిపురారం రెండు మండలాల పరిధిలోని నిడమనూరు మార్కెట్ కమిటీ.. వరుసగా మూడు పర్యాయాలు త్రిపురారం మండలానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవిని అప్పగించడంపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వ్యక్తికి మరోసారి చైర్మన్ పదవి దక్కగా, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై కన్నేసిన నియోజకవర్గానికి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరులు ఈవివాదం వెనుక ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. నేడు నిడమనూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి జగదీశ్‌రెడ్డి స్వాగతం పలికేందుకు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఎంపీపీ, సర్పంచ్ ఫోటోలు లేవని నిరసిస్తూ ఎంపీపీ సంఘం నాయకులు ఫ్లెక్సీలను చించివేశారు.
Read also: Lord Shiva Sahasranama Stotram Live: నేడు ఈ స్తోత్రం వింటే కోటి జన్మల పుణ్యం.. సిరిసంపదలు చేకూరుతాయి
ఫ్లెక్సీల్లో ప్రొటోకాల్ ప్రకారం నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, స్థానిక సర్పంచ్ మేరెడ్డి పుష్పలత ఫొటోలు ఫ్లెక్సీల్లో ప్రచురించకపోవడంతో ఎంపీపీ కుమారుడు, ఎంపీపీ సలహాదారు తన అనుచరులతో నిరసనకు తెలిపారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ ములుగు రామలింగయ్య, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సత్యపాల్ చూస్తుండగానే చించివేశారు. అయితే.. ఫ్లెక్సీలలో ఎంపీపీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ లేక పోవడం పద్దతేనా? అంటూ వారితో వాగ్వాదానికి దిగారు.
కాగా.. ఫ్లెక్సీ ప్రోటోకాల్ పాటించలేదని ఫ్లెక్సీలను చించివేత సంఘటన మార్కెట్ పరిధిలోని నిడమనూరు, త్రిపురారం మండలంలోనే కాకుండా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోను బీఆర్ఎస్ మధ్య చర్చనీయాంశం అయింది.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రొటోకాల్ లేని ఫ్లెక్సీలను తెల్లవారుజాము లోపే కూల్చివేస్తామని మార్కెట్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రారెడ్డి హెచ్చరించడంతో ఇవాల్టి ప్రమాణ స్వీకార సమయంలో పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. స్థానిక సర్పంచ్ ఫొటో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలలో ఫొటోలు లేకపోవడంతో సర్పంచ్ అనుచరులు కూడా గరం గరం ఉన్నట్లు తెలుస్తోంది.
Tollywood: ‘స్వాతిముత్యం’ సంపాదకుడికి ప్రతిష్టాత్మక పురస్కారం