Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల కలకలం రేపాయి. టీఆర్‌ఎస్ యూత్ నాయకులు బండి సంజయ్ ఫోటోతో పెట్టిన ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. సిరిసిల్లలోని పలు కూడళ్లలో బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలుతో ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ఏడ్చే మగవాళ్లను నమ్మవద్దని పురాణాలు చెబుతున్నాయి అని ఫ్లెక్సీలో ఉంది. ఓ వైపు బండి సంజయ్ కళ్లలోంచి నీరు కారడం మరో వైపు అమ్మాయి నవ్వుతుండటం ఫోటో పెట్టారు. ఫ్లెక్సీలో నవ్వే ఆడవాళ్లను అనే పదాలకు బదులు అందులో నవ్వే వాళ్లను అని ప్లెక్సీ పెట్టారు. బండి సంజయ్ పై.. టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు పెట్టడంతో.. బీజేపీ నాయకుల మండిపడుతున్నారు. ఆ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తొలిగించారు.
Read also: Adah Sharma : ఆదా ఆదా అందాలు చూపిస్తున్న అదా శర్మ
అయితే.. నిర్మల్ జిల్లా నైట్ క్యాంప్ నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమయ్యింది. 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కావడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ అందుకుంది. ముధోల్ నియోజకవర్గం, లింబ గ్రామం సమీపంలోని రాత్రి శిబిరం నుంచి పాదయాత్ర షురూ అయ్యింది. లింబ గ్రామం నుంచి సేవాలాల్ తండా, ఓల, కుంటాల మీదుగా అంబకంటి వరకు పాదయాత్ర కొనసాగనుంది. నేడు మొత్తం 11.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర అనంతరం అంబకంటి సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. రేపు యధావిధిగా మళ్లీ పాదయాత్ర మొదలవుతుంది. అయితే.. పాదయాత్రలో భాగంగా నేడు సిరిసిల్లలో బండిసంజయ్ పై వెలసిన ఫ్లెక్సీలు సిరిసిల్లలో ఉత్కంఠ వాతావరణం రేపుతుంది.
DK Aruna: జైలుకి వెళితే అవినీతిపై వెళతారు.. ప్రజలకోసం పోరాటమని చెప్పడం విడ్డూరం
