NTV Telugu Site icon

Flexes Against Modi: ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ లో ఫ్లెక్సీలు, పోస్టర్లు

Modi Pm

Modi Pm

Flexes against Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. మోడీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే ఏరియాలో మోడీని ఉద్దేశించి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాలేశ్వరం, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జాతీయ హోదాలు ఎక్కడికి పోయాయి మోడీ అంటూ ప్రశ్నిస్తూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.

Read also: Hyderabad : దారుణం.. చిన్నారి ముక్కును తీసేసిన డాక్టర్లు..ఆసుపత్రి బయట బంధువుల ఆందోళన..

వరంగల్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరుగుతోంది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ‘నేను వరంగల్-నాది తెలంగాణ’ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ మోడీకి ఏమైంది? అంటూ ఫ్లెక్సీ బయటకు వచ్చింది. అదే విధంగా గిరిజన యూనివర్సిటీ ఏమైంది?, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమైంది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఏమయ్యాయనే ప్రశ్నలు తలెత్తాయి.

తెలంగాణ పర్యటనకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటనను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా ములుగులోని కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ హాజరుకానున్నారు. కాలోజి సెంటర్ నుండి ఆర్ట్స్ కాలేజీ సభా ప్రాంగణానికి బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అదాలత్ సర్కిల్ నుండి సభ ప్రాంగణానికి బీజేపీ కార్యకర్తలు బయలుదేరారు.
Tamilnadu: తమిళనాడులో మరో పథకం.. గృహిణులకు ప్రతినెలా రూ.1000