Tragedy: ఐదేళ్ల పసిపాప దారుణ హత్య.. బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించిన హితిక్ష
- సాయంత్రం ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి
- ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా వైనం
- నిందితుడిపై అనుమానాలు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో హృదయాన్ని కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పసిపాప హితిక్షను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది.
ఆదర్శనగర్‌లో నివాసముండే ఆకుల రాములు, నవీన దంపతులకు వేదాస్, హితిక్ష అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఉపాధి కోసం రాములు గల్ఫ్ వెళ్లగా, నవీన అత్తామామల వద్ద ఉంటోంది. శనివారం సాయంత్రం కాలనీలోని ఇతర పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష ఆ తరువాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
తద్వారా పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చేపట్టగా, అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక విజయ్ ఇంట్లోనే మృతదేహంగా కనిపించడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా సందర్శించి సమాచారం సేకరించారు. నిందితుడిగా అనుమానిస్తున్న విజయ్‌కు ఇంటి యజమాని ఫోన్ చేయగా, తాను వరంగల్ జిల్లాలో ఉన్నానని అతడు చెప్పినట్లు సమాచారం. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనను తెలిసిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఓ పసిపాప ఈ స్థాయిలో హత్యకు గురవడం ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!