Site icon NTV Telugu

Suryapet Crime: దేవుడా.. పడిపూజకు వెళ్లి వస్తుండగా ఐదుగురు మృతి

Suryapets Crime

Suryapets Crime

Suryapet Crime: సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శనివారం రాత్రి మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్ ఎడమ కాలువ ఆయప్ప ఆలయంలో జరిగిన మహాపడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అయ్యప్ప ఆలయానికి యూటర్న్ ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉండడంతో డ్రైవర్ దూరం తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Read also: Kerala: అంతర్జాతీయ అంధుల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన కేరళ గవర్నర్

క్షతగాత్రులను అంబులెన్స్‌లు, అందుబాటులో ఉన్న వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మం, సూర్యాపేటలోని ఆసుపత్రులకు తరలించగా, స్వల్పంగా గాయపడిన వారికి కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులను తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల, ఉదయ్ లోకేష్, నరగాని కోటయ్య, గండు జ్యోతిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌పై 38 మంది ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో 10సెకన్ లలో రోడ్డు సర్వీస్ రోడ్ కు చేరుకునే లోపే ప్రమాదం జరగడం అక్కడ ఉన్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది…తమ కుటుంబం సభ్యులకు అయ్యప్ప మాల ధరించడంతో వారు నిర్వహించే పడి పూజ కార్యక్రమం చూసేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరగ డంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంచి స్కూల్ వద్ద కురుమల్ గూడ ఇంద్రనగర్ కి చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు ప్రయాణిస్తుండగా RCI మెయిన్ రోడ్ లో స్కూల్ వద్ద మహేశ్వరం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో.. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పేరు మునవత్, గణేష్ గా గుర్తించారు. వీరిద్దరు విద్యార్థులని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు బాలాపూర్ పోలీసులు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
Sunday Bhakthi Tv Stothra Parayanam Live: కార్తిక ఆదివారం ఈ స్తోత్రాలు వింటే..

Exit mobile version