Site icon NTV Telugu

ఒవైసీ ఇంటిపై హిందూ సేన దాడి..

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని అధికారిక నివాసంపై ఇవాళ దాడి జరిగింది.. ఒవైసీ అధికారిక నివాసంపైకి దూసుకెళ్లిన హిందూ సేన కార్యకర్తలు.. గేట్‌ దగ్గర హంగామా చేశారు.. నేమ్ ప్లేట్‌, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగలగొట్టారు. హిందువులకు వ్యతిరేకంగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తమ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని.. అందుకే అతని నివాసంపై దాడి చేశారని తెలిపారు హిందూ సేన అధినేత విష్ణు గుప్త.. కాగా, ఈ దాడిలో గేటుతో పాటు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి.. ఇంటి ఆవరణలో చెల్లాచెదురుగా ఆ ముక్కలు పడవేశారు హిందూసేన కార్యకర్తలు.. మరోవైపు.. ఈ దాడి ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకే పరిమితం అని చెప్పుకునే ఎంఐఎం పార్టీ.. దేశవ్యాప్తంగా పోటీ చేస్తూ వస్తుంది.. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఒవైసీ.. ఏకంగా వంద సీట్లను పోటీకి రెడీ అవుతున్నారు.. ఈ మధ్య యూపీలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై అక్కడ కేసులు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version