Secunderabad: సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. నిలిచి ఉన్న బోగీల నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా పొగ కమ్ముకోవడంతో చుట్టు పక్కల ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత నిలిచి ఉన్న బోగీల నుంచి మంటలు చెలరేగాయని తెలుసుకున్నారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ ఫాం మీదకి వస్తున్న అదనపు ఏసి బోగిలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు, పొగలను ఆర్పివేసారు. కోచ్ క్లీనింగ్ కి వెళ్లి ప్లాట్ ఫామ్ మీదకి వస్తున్న అదనపు ఏసి బోగిలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని తెలిపారు.
Read also: Gold Price Today: సంతోషించేలోపే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
దీనిని గుర్తించిన సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. మెట్టుగూడ వాషింగ్ లైన్ లో అగి ఉన్న ఏసీ బోగీలో మంటలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరా తీసారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘట్టానాస్థలానికి చేరుకున్నారు. అయితే బోగీలో షాట్ సర్క్యూట్ కు గల కారణాలను ఆరా తీస్తున్నారు. బోగీలో మంటల చెలరేగిన ముందు క్లీనింగ్ సిబ్బంది ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Phone Addiction: ఫోన్ చూడొద్దని తల్లి మందలిస్తే.. పురుగులు మందు తాగిన చిన్నారి.. !!(