మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రజల జీవన విధానమే మారిపోయింది. అసలు ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రోజులో కొన్ని గంటల పాటు ఆ ఫోన్లు చూడటానికే సమయాన్ని వినియోగిస్తున్నారు నెటీజన్లు. ప్రస్తుతం కొంతమంది చిన్నపిల్లలైతే ఆ ఫోన్లో వీడియోలు చూపించనిదే అన్నం తినడం లేదు. మరికొంతమంది టీనేజీ యువత ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపై మారాం చేస్తుంటారు. అయితే ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్లో ప్రాంతంలో విషాదం ఓ మైనర్ యువతి తన తల్లిదండ్రులు ఫోన్ వాడనియ్యడం లేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.