Site icon NTV Telugu

Fire in Satavahana Varsity: శాతవాహనవర్శిటీలో అగ్నిప్రమాదం

కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లు పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించారు.

ప్రమాదం కారణంగా యూనివర్శిటీలో పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి మంటలు. బాయ్స్ హాస్టల్ సమీపం నుంచి ఎంబీఏ కాలేజీ ఆవరణం వరకూ విస్తరించాయి మంటలు. శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. ఎండ వేడిమి ఎక్కువగా వుండడంతో మంటల తీవ్రత ఎక్కువగా వుందని తెలుస్తోంది.

https://ntvtelugu.com/yellareddy-incident-mla-rajasingh-arrest-in-alwal/
Exit mobile version