Site icon NTV Telugu

Fire Department: అగ్నిరేగితే ఆర్పేదెలా.. నేటి నుంచి అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

Fire Department Celebrations From Today

Fire Department Celebrations From Today

Fire Department: అగ్ని మాపక శాఖ వారోత్సవాల్లో బాగంగా ఫైర్ పరికరాలు ఎగ్జిబిషన్ , ప్రజల్లో అవగాహన కోసం.. అగ్ని ప్రమాదాలఫై ఫైర్ సేఫ్టీ డీజి నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. మాదపూర్ లోని అగ్నిమాపాక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అగ్నిమాపక శాఖలో మొత్తం 137 ఫైర్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ కానిస్టెన్సీకి ఒక అగ్నిమాపక వాహనం ఉంటుందని అన్నారు. ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ పని చేస్తుందని, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సమయంలోనే ఫైర్ నిబంధనలు ఉంచుకోవాలని సూచించారు. మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నపుడు ఎలాంటి ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలి అనేది భవన నిర్మాణ నిబంధనల్లొ స్పష్టం చేయబడుతుందని అన్నారు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టుకుని దాన్ని సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ పనితీరు వేగంగా జరగాలి అంటే ఘటన జరిగిన వెంటనే సమాచారం త్వరగా అందంచాలని సూచించారు. నగరంలో భవన సముదాయలపై ఫైర్ ఆడిట్ ను కొనసాగిస్తూనే ఉన్నామని, ఇది నిరంతరాయంగా సాగే ప్రక్రియ అని తెలిపారు.

read also: Complaint on Husband: నా భర్త లిప్‌స్టిక్ పూసుకుని, ఆడవారి లోదుస్తులు వేసుకుంటున్నాడు.. భార్య ఫిర్యాదు

అగ్నిమాపక శాఖ, ghmc అనుమతులు ఇచ్చిన అనంతరం భవన యజమానులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు కొనసాగుతున్నాయని, హైదరాబాద్ లో 34 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి జనాభాకు అనుగుణంగానే అగ్నిమాపక పరికరాలు ఉన్నాయని తెలిపారు. అగ్నిప్రమాదాలపై గత సంవత్సరం దాదాపు 8000 కాల్స్ వచ్చాయని, ప్రస్తుతం కూడా 20 నుంచి 30 కాల్స్ వస్తున్నాయని 80 కి పైగా కాల్స్ వచ్చే సందర్భాలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ మహా నగరంలో హై రేంజ్ బిల్డింగ్స్ 6000 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలకు విద్యుత్ ఘాతాలు ప్రధాన కారణంగా ఉన్నాయని తెలిపారు. అదనంగా 1500 ఫైర్ సూట్స్ ను ఆర్డర్ చేయడం జరిగిందని అన్నారు. అజ్మత్ అనేటువంటి ప్రత్యేక వాహనాలు ఉన్నాయని, వాటి ద్వారా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు సపరేట్ టీమ్ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Student Hanging: ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

Exit mobile version