Site icon NTV Telugu

Fire accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కారులోనే సెక్యూరీటి గార్డ్ సజీవ దహనం

Abida Car Garage

Abida Car Garage

Fire accident: స్వప్రలోక్‌ ఘటన మరువక ముందే.. హైదరాబాద్‌ అబిడ్స్‌లో మరో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే వున్న కారు మెకానిక్‌ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఆమంటలు గ్యారేజీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయభ్రాంతులైన కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది.. ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తీగా అదుపుచేశారు. ఈప్రమాదంలో దాదాపు ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఐదుకార్లలో ఒకకారులో సెక్యూరిటీ గార్డ్‌ నిద్రపోయాడు. అందులో కూడా మంటలు అంటుకోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. కారులో సజీవ దహనమైన సెక్యూరిటీ గార్డ్‌ సంతోష్‌ గా గుర్తించారు పోలీసులు. ఈ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. సెక్యూరిటీ గార్డ్‌ సంతోష్‌ కు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు. అబిడ్స్‌లో ఉదయం చెప్పులు కుట్టడం, రాత్రి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు.

Read also: Child Marriage: బాల్యవివాహం కలకలం.. సాయిబాబా గుట్టు రట్టు

రోజు మాదిరిగానే నిన్న ఉదయం ఇంట్లోంచి ఉద్యోగానికి వెళ్ళిన సంతోష్ చెప్పులు దుకాణంలో విధులు ముగించుకొని కార్ల గ్యారేజ్ లో డ్యూటీకి వచ్చాడు. రాత్రి భోజనం చేసిన తరువాత పన్నెండు గంటలకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. తిన్నానని పడుకుంటున్నాని తల్లికి చెప్పి సంతోష్ కారులో నిద్రించాడు. ఉదయం సంతోష్ చనిపోయాడని ఫోన్ చేసి చెప్పడంతో గ్యారేజ్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాను కుటుంబ సభ్యులు. ఈ మధ్యనే సంతోష్ అన్న చనిపోయాడని ఇప్పుడు చిన్న కొడుకు కూడా చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి పెద్దదిక్కుగా వుండి పోషిస్తూ వస్తున్న సంతోష్‌ కూడా చనిపోయాడని ఇక మాకు దిక్కెవరని వాపోయారు. సంతోష్‌ కుటుంబ సభ్యుల రోదనలు విని స్థానికులు చలించిపోయారు. అయితే.. కామినేని హాస్పిటల్ కి అనుకునే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది, పేషంట్లను తరలించేందుకు సిద్దమయ్యారు. అంతేకాకుండా.. ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్ కి సంబంధించిన పవర్ జనరేటర్స్ కూడా ఉన్నాయి. అయితే ఫైర్‌ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపుచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ దుస్థితి.. ఎన్నికల నిర్వహణకు కూడా డబ్బుల్లేవు..

Exit mobile version