NTV Telugu Site icon

Fire accident : జగిత్యాల కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..

Firee

Firee

తెలంగాణాలో ఇటీవల వరుసగా గా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత రెండు నెలల్లో భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి.. ఇప్పటికే కొన్ని ప్రమాదాలు ఎలా జరిగాయి అనే దానిపై క్లారిటీ రాలేదు.. అయితే ఇప్పుడు మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. కలప మిల్లులో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది..

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్‌ షా కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిగురుజు దగ్గర గల మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అగ్ని శకలాలు ఎగసి పడ్డాయి.. క్షణాల్లోనే మిల్లు మొత్తం మంటలు వ్యాపించాయి.. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు..

అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ, భారీగా ఆస్తినష్టం సంభవించిందని చెప్పారు. మిల్లులో ఉన్న కలప పూర్తిగా దగ్ధమైందన్నారు. విద్యుత్‌ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..