సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలోని డ్రమ్స్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయి. ఇది గమనించి స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనల స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది ఫైర్‌ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగనట్లు తెలుస్తోంది. అస్తి నష్టం ఎంతవరకు జరిగందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
