Site icon NTV Telugu

ఉస్మానియాలో ఊడిపడిన ఫ్యాన్‌.. డ్యూటీ డాక్టర్ కు గాయాలు..

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆగ్రస్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఉంది. పేదవారికి సంజీవినిలా ఉన్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ డిపార్ట్‌మెంట్‌లో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్‌ పై సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడింది.

దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువులా ఉండే ఈ ఉన్నత శ్రేణి ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్సకు వచ్చిన రోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆసుపత్రిలో పరిస్థితి ఇలా ఉంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎప్పడూ రోగులతో రద్దీగా ఉండే ఉస్మానియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

Exit mobile version