తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆగ్రస్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఉంది. పేదవారికి సంజీవినిలా ఉన్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ డిపార్ట్‌మెంట్‌లో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువులా ఉండే ఈ ఉన్నత శ్రేణి ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్సకు వచ్చిన…