Site icon NTV Telugu

Fee Reimbursement: చర్చలు సఫలం.. నిధులకు పచ్చజెండా.. ప్రైవేట్ కళాశాలల బంద్ విరమణ

Students

Students

Fee Reimbursement: రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ (యూఎస్సీ) నిధుల కోసం ఆందోళన చేస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం తమ బంద్‌ను విరమించుకున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. మొత్తం రూ. 1207 కోట్ల యూఎస్సీ బకాయిల్లో, ప్రస్తుతం రూ. 600 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన రూ. 600 కోట్లను దీపావళి నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

Little Hearts : బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా “లిటిల్ హార్ట్స్”..కలెక్షన్స్ ఎంతంటే?

ప్రభుత్వానికి కళాశాల యాజమాన్యాలు సమర్పించిన ప్రతిపాదనల్లో, ప్రస్తుతానికి రూ. 700 కోట్లు విడుదల చేయాలని కోరాయి. ఇందులో వృత్తి విద్యా కళాశాలలకు రూ. 500 కోట్లు, డిగ్రీ, పీజీ కళాశాలలకు రూ. 200 కోట్లు వెంటనే చెల్లించాలని విన్నవించాయి. అయితే, చర్చల అనంతరం ప్రభుత్వం రూ. 600 కోట్లు వెంటనే విడుదల చేయడానికి అంగీకరించింది.

చర్చలు విజయవంతం కావడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు, కళాశాలలకు ఊరట లభించినట్లయింది. యూఎస్సీ నిధులు విడుదల అయితే, కళాశాలలు వాటి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడంతో పాటు, విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Ganja Seized: సినిమాటిక్‌ రేంజ్‌లో మెరుపుదాడులు.. 500 కిలోల గంజాయి సీజ్!

Exit mobile version