Inter students: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. చదువు కుంటూ మధ్యలో కాలేజీ మానేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజు వాపసు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కళాశాలల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కనీసం ఏడాదికి రెండుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కౌన్సెలింగ్ విద్యార్థులకు ప్రత్యేక ఫ్యాకల్టీలను నియమించాలని సూచిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేశారు.
Read also: TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నేడు హైకోర్టు తీర్పు
ఇటీవల నార్సింగిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఘటన అనంతరం ఎంహెచ్‌ఆర్‌డీలో అధికారులు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇంటర్ విద్యా బోధనకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. అనంతరం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ మార్చి 17న సమావేశమై మార్గదర్శకాలు ఎలా ఉండాలనే దానిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా విద్యార్థులు కళాశాలను మధ్యలోనే వదిలేస్తే, వారు చెల్లించిన ఫీజులో కొంత వాపసు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు కళాశాలలో చేరిన మూడు నెలల్లోపు ఉపసంహరించుకుంటే, 75 శాతం ఫీజును యాజమాన్యం తిరిగి ఇవ్వాలి. 6 నెలల్లో 50 శాతం, ఆ తర్వాత 25 శాతం. వారం రోజుల్లోగా వాపసు ఇవ్వాలని స్పష్టం చేశారు.
Read also: Delhi Liquor Scam: లిక్కర్ కేసులో మరో మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు
ప్రభుత్వ మార్గదర్శకాలు:
* ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లోనే తరగతులు నిర్వహించాలి.
* కళాశాలలను అర్హత కలిగిన సిబ్బందితో నిర్వహించాలి. సిబ్బందికి కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలి.
* సిబ్బందిని మధ్యలో (ఏప్రిల్ కంటే ముందు) తొలగించకూడదు. తొలగింపు విషయంలో ముందుగా నోటీసు ఇవ్వాలి. వారి స్థానాలను భర్తీ చేయాలి.
* ప్రిన్సిపాల్‌ను మార్చాల్సి వస్తే ముందుగా ఆయా కళాశాలలు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి అనుమతి తీసుకోవాలి.
* కాలేజీ సమయాల్లో బయటి వ్యక్తులను లోపలికి అనుమతించరు. నిర్ణీత సమయాల్లో తల్లిదండ్రులను అనుమతించవచ్చు.
* ప్రతి కళాశాల ఇంటర్ బోర్డు జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌ను అనుసరించాలి.
* అదనపు తరగతులు రోజువారీ 3 గంటల కంటే ఎక్కువ తీసుకోకూడదు.
* రెసిడెన్షియల్ కాలేజీల్లో విద్యార్థులకు కనీసం 8 గంటల నిద్ర ఇవ్వాలి.
* ఉదయం తయారుకావడానికి, బ్రేక్ ఫాస్ట్ కు గంటన్నర సమయం ఇవ్వాలి.
* మధ్నాహ్నం, రాత్రి భోజనం కోసం 45 నిమిషాలు అనుమతించాలి.
* ప్రతి రోజు స్పోర్ట్స్, రిక్రియేషన్ కార్యక్రమాలు చేయాలి. సాయంత్రం రిక్రియేషన్ కోసం ఒక గంట సమయం ఇవ్వాలి.
* ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన డైరీలను నిర్వహించాలి.
* విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలి.
* ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి.
Viral Video: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..