NTV Telugu Site icon

Kidnap: మాఇంటిపై 100 మంది దాడిచేసి నాకూతుర్ని కిడ్నాప్‌ చేశారు..

Adibhatla

Adibhatla

Kidnap: రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్‌ కలకలం రేపింది. జిల్లాకు చెందిన తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్నగూడలో యువతి కిడ్నాప్ సంచలనంగా మారింది. సుమారు 100 మంది రౌడీలతో కలిసి యువతని మిస్టర్ టి ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. యువతి నివసిస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసం చేసారు. తల్లిదండ్రులకు, పక్కింటి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఘటన స్థలిని పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వరరావు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Read also: Telangana Bhavan: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

ఆదిబట్లలో ఆర్భాటంగా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లివేడుకలకు ఇంటికి పెద్దలద్దరూ చేరుకున్నారు. అయితే ఇక్కడే సినిమా తరహా కిడ్నాప్‌ కలకలం రేపింది. పెళ్లి ఇంటిపై 100 మంది యువకులు వచ్చి దాడి చేశారు. ఇంట్లో వున్న తన కూతురు డెంటల్ డాక్టర్ వైశాలిని కిడ్నాప్‌ చేశారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని తల్లిదండ్రులను విచారించారు. తమ కూతురు డెంటల్ డాక్టర్ వైశాలిని బలవంతంగా నవీన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తల్లిదండ్రుల ఆరోపించారు. అమ్మాయి ఇంటిపై 100 మందికి పైగా యువకుల దాడి చేశారని తెలిపారు. అమ్మాయిని తీసుకెళ్లిన యువకుడు టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి గా తెలిపారు. నగరం మొత్తం మిస్టర్ టీ పేరుతో ఫ్రాంచెస్ ఇచ్చిన నవీన్, 100 మంది కలిసి వైశాలిని ఎత్తుకుపోయినట్లుగా కిడ్నీప్‌ గురైన వైశాలి తండ్రి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ స్థలానికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాని పరిశీలిస్తున్నారు. వైశాలి, నవీన్‌ కి ఇంతకు ముందే పరిచయం ఏమైనా ఉందా? లేక తండ్రిమీద కోపంతో వైశాలిని కిడ్నాప్‌ చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
JD Lakshmi Narayana: ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ క్లారిటీ.. అక్కడి నుంచే బరిలోకి..