Kaleshwaram Gravity Canal: విషాదం.. కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Gravity Canal: రామచంద్రాపూర్ లో విషాదం జరిగింది. కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో రాముడుగు మండలంలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరై స్నానానికి వెళ్లిన తండ్రి కొడుకులకు మృత్యువు కబలించింది. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈరెల్లి లచ్చయ్య, శేఖర్ మృతదేహాలను వెలికి తీశారు. ఒకే కుటుంబములో ఇద్దరు మృతి తో రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Total Lunar Eclipse 2022: ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం.. “బ్లడ్ మూన్”గా దర్శనం ఇవ్వనున్న చంద్రుడు
Also Read
కుటుంబంలోని వ్యక్తి మృతి చెందడంతో చివరి చూపు చూసేందుకు కుటుంబం రామచంద్రాపూర్ చేరుకుంది. అయితే అత్యక్రియలు అయిపోయిన తరువాత స్నానం చేసేందుకు తండ్రి కొడుకులు ఇద్దరు కెనాల్ లో దిగారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొడుకు నీట మునుగుతుండటంతో.. కొడుకును కాపాడేందుకు తండ్రి ప్రయత్నించాడు. కానీ.. తండ్రికూడా కొడుకుతోపాటు నీటమునిగారు. ఇద్దరు కళ్లముందే నీటమునుగుతున్నా కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియలకు వచ్చిన తండ్రి,కొడుకులు ఇద్దరు మృత్యువుతో పోరాడినా చివరకు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. ఇద్దరి మృతితో రామచంద్రాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటిపెద్ద, కన్నకొడుకు ఇద్దరు చనిపోవడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది.
Rajendranagar ATM: బ్యాంక్ సిబ్బందినే బురిటీ కొట్టించిన డ్రైవర్.. రూ.36 లక్షలతో పరార్
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..