NTV Telugu Site icon

Kaleshwaram Gravity Canal: విషాదం.. కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి

Kaleshwaram Gravity Canal

Kaleshwaram Gravity Canal

Kaleshwaram Gravity Canal: రామచంద్రాపూర్ లో విషాదం జరిగింది. కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో రాముడుగు మండలంలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరై స్నానానికి వెళ్లిన తండ్రి కొడుకులకు మృత్యువు కబలించింది. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈరెల్లి లచ్చయ్య, శేఖర్‌ మృతదేహాలను వెలికి తీశారు. ఒకే కుటుంబములో ఇద్దరు మృతి తో రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Total Lunar Eclipse 2022: ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం.. “బ్లడ్ మూన్”గా దర్శనం ఇవ్వనున్న చంద్రుడు

కుటుంబంలోని వ్యక్తి మృతి చెందడంతో చివరి చూపు చూసేందుకు కుటుంబం రామచంద్రాపూర్‌ చేరుకుంది. అయితే అత్యక్రియలు అయిపోయిన తరువాత స్నానం చేసేందుకు తండ్రి కొడుకులు ఇద్దరు కెనాల్‌ లో దిగారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొడుకు నీట మునుగుతుండటంతో.. కొడుకును కాపాడేందుకు తండ్రి ప్రయత్నించాడు. కానీ.. తండ్రికూడా కొడుకుతోపాటు నీటమునిగారు. ఇద్దరు కళ్లముందే నీటమునుగుతున్నా కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియలకు వచ్చిన తండ్రి,కొడుకులు ఇద్దరు మృత్యువుతో పోరాడినా చివరకు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. ఇద్దరి మృతితో రామచంద్రాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటిపెద్ద, కన్నకొడుకు ఇద్దరు చనిపోవడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది.
Rajendranagar ATM: బ్యాంక్ సిబ్బందినే బురిటీ కొట్టించిన డ్రైవర్.. రూ.36 లక్షలతో పరార్

Show comments