NTV Telugu Site icon

Kamareddy Master Plan: హైకోర్టుకు రైతులు.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం

Kamareddy Master Plan Formers

Kamareddy Master Plan Formers

Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు లో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ రామేశ్వర్ పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రైతుల రిట్‌ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ చూస్తే కేవలం తమను ఇబ్బంది పెట్టేందుకే అన్నట్టుగా ఉందని రైతులు వాపోతున్నారు. న్యాయం కోసం అవసరమైతే సుప్రీం కోర్ట్ తలుపు తట్టేందుకైనా సిద్ధమంటున్న రైతులు. హైకోర్టులో న్యాయం జరగపోతే.. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. పంట పొలాలు దూరమైతే మేము రోడ్డున పడాల్సి వస్తుందని, నోటి కాడ కూడును లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. దీనిపై కలెక్టరేట్‌ ముట్టడికి బయలు దేరారు. అయితే నిన్న రెండోరోజు రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కామారెడ్డి బంద్ ను ప్రకటించిన రైతులు కలెక్టరేట్‌ ముట్టడికి బయలు దేరిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు కాంగ్రెస్‌ నేతలను, నిన్న రాత్రి బండి సంజయ్‌ ను కూడా అదుపులో తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రైతులపై దాడి, అరెస్ట్‌ లపై మండి పడ్డ రైతులు ఇవాళ కూడా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటి వరకు కలెక్టర్‌ స్పందించకపోవడం.. రైతులతో మాట్లాడకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేదేలేదని, ఆందోళన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు.

Read also: Rain Alert: అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

అయితే.. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టనున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి లో టీపీసీసీ రేవంత్ రెడ్డి పర్యటన పై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తత తో రేవంత్ పర్యటన డైలమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు కలెక్టర్ తీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రైతులను కలెక్టర్ కలవలేదని మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో.. నిన్న రాత్రి కలెక్టరేట్ ముట్టడి తో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలీసు వాహనం ధ్వంసం ఘటనలో 20 మంది పై కేసులు నమోదు చేశారు. బీజేపీ నేతలు కార్యకర్తలు, పలువురు రైతుల పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ముగ్గురు రైతులు చికిత్స పొందుతుంది. నేడు రైతులకు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. అడ్లూర్ ఎల్లా రెడ్డి లో రైతులను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నట్లు సమాచారం. అయితే నిన్న బండిసంజయ్‌ అరెస్ట్‌ తో ఉద్రికత్త నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రేవంత్‌ రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తారా? రైతులకు పరామర్శించేందుకు పోలీసులు అనుమతి ఇస్తారా? అనే ప్రశ్నలు చర్చకు దారితీస్తున్నాయి. ఇవాళ రైతుల ఆందోళనకు మూడు రోజుకు చేరింది. అయితే ఇప్పటి వరకు కూడా కలెక్టర్‌ స్పందిచక పోవడం.. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గానీ, కలెక్టర్‌ గానీ రైతులతో మాట్లాడకపోవడంతో రైతుల ఆందోళన మరింత పటిష్టంగా మారింది. అయితే దీనిపై రెండు రోజులముందు కేటీఆర్‌ మట్లాడిన విసయం తెలిసిందే. అధికారులపై కూడా మంత్రి సీరియస్‌ అయ్యారు. ఏమైనా ఉంటే అధికారులతో ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని కోరారు మంత్రి. అయితే అదంతా పక్కనపెట్టిన రైతులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన కొనసాగించారు. దీనికి మద్దతుగా టీ.కాంగ్రెస్‌ నేతలు, బీజేపీ పలికింది. దీంతో రైతుల ఆందోళనకు మరింత బలం చేరుకుంది. మరి ఇవాళ చేపడుతున్న రైతుల ఆందోళనకు రేవంత్‌ వెళ్తారా? అనేది ఉత్కంఠంగా మారింది.

అసలేం జరిగింది:

అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములుకు కామారెడ్డి పట్టణ శివారులోని ఇలిచపూర్‌ వద్ద 3 ఎకరాల సాగుభూమి ఉంది. అయితే.. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. కాగా.. మున్సిపల్‌ నూతన మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదనల్లో ఆయన భూమిని ఇండ్రస్టియల్‌ జోన్‌లోకి మార్చడంతో భూమి అమ్ముడుపోవడం లేదు. అయితే.. మనస్తాపానికి గురైన రాములు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతులు మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకుని బల్దియా వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరారు. వారిని పోలీసులు కామారెడ్డి బస్టాండ్‌ వద్ద అడ్డుకోవడంతో.. పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. అయితే.. రైతులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. కాగా.. పోలీసులు కొత్తబస్టాండ్‌ వద్దనున్న మృతదేహాన్ని అశోక్‌నగర్‌ కాలనీ, రైల్వేగేట్, పాత బస్టాండ్‌ మీదుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్‌ నూతన మాస్టర్‌ప్లాన్‌ వెనక్కి తీసుకోవాని ఆదారంగా వున్న పంటపొలాలను లాక్కునేందుకు మాస్టర్‌ప్లాన్‌ అంటూ ఆందోళనకు దిగారు. మరి దీనిపై రైతులకు హైకోర్టులో న్యాయం జరిగేనా? చర్చ జరుగుతుంది. ఒక వేళ హైకోర్టులో న్యాయం జరగకపోతే.. సుప్రీం కోర్టుకు వెళతామంటున్నారు రైతులు. హైకోర్టులో సోమవారం జరిగే రైతుల రిట్‌ పిటిషన్‌ పై సర్వాత్రా ఆశక్తి నెలకొంది.