Chikoti Praveen: ప్రవీణ్ చికోటికి ప్రాణహాని.. భయాందోళనలో కుటుంబసభ్యులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chikoti Praveen: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది.. ఎక్కడ చూసిన అతడి న్యూసే.. రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ.. విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చీకటి సామ్రాజ్యం లింక్‌లు కదులుతున్నాయి.. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగిఉన్న ఆయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం వెలుగు చూసింది.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా.. చాలా మంది చికోటితో చీకటి బాగోతం నడిపారనేఏ ఆరోపణలు వస్తున్నాయి.. చికోటీ ప్రవీణ్…అలియాస్ క్యాసినో ప్రవీణ్.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్ నడుస్తోంది. ఈడీ రంగంలోకి దిగడంతో చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు.
Devineni Uma: అదే జరిగితే.. జగన్ జైలుకి వెళ్లడం ఖాయం
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
చికోటి ప్రవీణ్‌తో పాటు ఈ చీకటి వ్యాపారంలో మాధవరెడ్డి పాత్ర చాలా కీలకమైనదని అధికారులు గుర్తించారు.. పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి క్రమంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడి లక్షల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయి.. చికోటి ప్రవీణ్‌తో పరిచయంతో క్యాసినో సామ్రాజ్య విస్తరణకు దారితీసిందట. మొత్తంగా చికోటి ప్రవీణ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇదిలా ఉండగా.. సైదాబాద్‌లో ప్రవీణ్ చికోటి ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పహారా కాస్తున్నట్లు చికోటి ప్రవీణ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఉదయం నుండి ఇంటి సమీపంలో దుండగులు తిష్ట వేసినట్లు భయాందోళనకు గురవుతున్నారు. బిల్డింగ్ చుట్టూ చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ అప్రమత్తం అయ్యారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఆ వ్యక్తులను కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు. సోమవారం ఈడీ ముందు విచారణకు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను బయటపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్‌కు ప్రాణహాని ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
-
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!