Site icon NTV Telugu

Chikoti Praveen: ప్రవీణ్ చికోటికి ప్రాణహాని.. భయాందోళనలో కుటుంబసభ్యులు!

Chikoti Praveen

Chikoti Praveen

Chikoti Praveen: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్‌ పేరు హాట్‌ టాపిక్‌ అయ్యింది.. ఎక్కడ చూసిన అతడి న్యూసే.. రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ.. విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చీకటి సామ్రాజ్యం లింక్‌లు కదులుతున్నాయి.. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా.. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగిఉన్న ఆయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం వెలుగు చూసింది.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా.. చాలా మంది చికోటితో చీకటి బాగోతం నడిపారనేఏ ఆరోపణలు వస్తున్నాయి.. చికోటీ ప్రవీణ్…అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్‌ నడుస్తోంది. ఈడీ రంగంలోకి దిగడంతో చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు.

Devineni Uma: అదే జరిగితే.. జగన్ జైలుకి వెళ్లడం ఖాయం

చికోటి ప్రవీణ్‌తో పాటు ఈ చీకటి వ్యాపారంలో మాధవరెడ్డి పాత్ర చాలా కీలకమైనదని అధికారులు గుర్తించారు.. పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి క్రమంగా క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడి లక్షల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయి.. చికోటి ప్రవీణ్‌తో పరిచయంతో క్యాసినో సామ్రాజ్య విస్తరణకు దారితీసిందట. మొత్తంగా చికోటి ప్రవీణ్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఇదిలా ఉండగా.. సైదాబాద్‌లో ప్రవీణ్ చికోటి ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పహారా కాస్తున్నట్లు చికోటి ప్రవీణ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఉదయం నుండి ఇంటి సమీపంలో దుండగులు తిష్ట వేసినట్లు భయాందోళనకు గురవుతున్నారు. బిల్డింగ్ చుట్టూ చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ అప్రమత్తం అయ్యారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఆ వ్యక్తులను కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు. సోమవారం ఈడీ ముందు విచారణకు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను బయటపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్‌కు ప్రాణహాని ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు భయపడుతున్నారు.

Exit mobile version