NTV Telugu Site icon

Customer Care Fraud: గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్లు.. యాప్​ డౌన్​లోడ్​ చేయించి నిలువు దోపిడి

Customer Care Fraud

Customer Care Fraud

Customer Care Fraud: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర కూర్చుని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఒక్క పాస్‌వర్డ్, ఓటీపీ, ఇంటి చిరునామా ఇవ్వడం ద్వారా వారికి కావాల్సిన అంగట్లో వస్తువులన్నీ డెలివరీ చేయబడతాయి. అంతేకాకుండా.. రైలు, బస్సు, విమానం రిజర్వేషన్లు ఇంటి నుంచి సులువుగా చేస్తున్నారు. ఈ క్రమంలో మనం కస్టమర్​కేర్​ సెంటర్లను ఆన్​లైన్​లో వెతికామంటే.. సైబర్​ నేరగాళ్ల చేతిలో బలైపోయినట్టే.. ఇలాంటి సైబర్‌ కేసులు రెండు నెలల్లో నగరంలో సుమారు 200 దాకా ఇలాంటి తరహా కేసులు నమోదయ్యాయి.

నకిలీ వెబ్‌సైట్లు

నకిలీ వెబ్‌సైట్లు నయాగా తయారు చేసి ఫోన్‌ నంబర్లను సైబర్​ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. ఇలా.. హరియాణా, ఝార్ఖండ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్‌సైట్‌ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. దీన్ని గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్‌ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్​లో నకిలీదే ముందు కనిపిస్తుంది. వీటిని నమ్మి బాధితులు మోసపోతున్నారు. ఇలా భాగ్యనగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఇలాంటి మోసాలు దాదాపు 200 వరకూ నమోదయ్యాయి. ఈ గూగుల్‌ ఫ్రాడ్‌ వల్ల బాధితులు రూ.8 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. ఇలాంటి తరహా మోసాలు మున్ముందు పెరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సరే.. ఏదైనా కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం మీరు గూగుల్​లో వెతికినప్పుడు ముందుగా వచ్చిన నంబర్​ను నమ్మొద్దని, అది కరెక్ట్ నంబరా లేదా ఫేక్ నంబరా అనేది చెక్ చేసుకోవాలి. కాగా.. సాధారణంగా ప్రతి కంపెనీ తమ ప్రాడక్ట్స్, యూజర్ గైడ్ బుక్స్​, రసీదులపై తమ కస్టమర్ కేర్ నంబర్​ను ప్రింట్ చేసి ఉంచుతుందని, వీలైనంత వరకు మీరు వాటిని సంప్రదించాలని కోరారు. అయితే.. బ్యాంకులు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ఈ ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుతాయి. అధికారిక వెబ్‌సైట్లు హెచ్‌టీటీపీ, తాళం గుర్తుతో మొదలవుతాయి. ఈఫ్రాడ్‌ మెసాలకు ఓ హైదరాబాద్ వాసి ఆన్​లైన్​లో బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే.. వేరే పనులు ఉండటం వల్ల రిజర్వేషన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.. దానికోసం ఆన్​లైన్​లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సర్చ్ చేసి చివరకు అది ఫేక్ కావడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్కయ్యాడు దీంతో బాధితుడు నుంచి రూ.1. 89లక్షలు కాజేశారు.

నిలువు దోపిడి..

ఇక మరో హైదరాబాద్ వాసి ఆన్​లైన్​లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అదికాస్తా సమయానికి డెలివరీ కాకపోవడంతో కస్టమర్ కేర్​ నంబర్​ కోసం గూగుల్​లో వెతికాడు. అందులో ఓ నంబర్‌ కనిపించడంతో దానికి కాల్ చేసాడు. అటునుంచి ఓ వ్యక్తి కాల్‌ లో మాట్లాడి ఓ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేస్తే మీకు సులువుగా పని జరుగుతుందని నమ్మబలికాడు. దీన్ని నమ్మిన కస్టమర్‌ ఆ యాప్‌ ను డౌన్​లోడ్ చేశాడు. అంతే. నిమిషంలో కస్టమర్‌ బ్యాంకు ఖాతాలో వున్న నుంచి రూ.99 వేలు ఖాళీ అయ్యాయి. ఇలా కొత్త తరహామోసాలకు తెర లేపుతున్నారు. వీల్ల ఉచ్చులో పాపం అమాయకులు బలి అవుతున్నారు. తెలివిగా వున్నా వారి అమాయకులను ఆసరాగా తీసుకుని వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మకూడదని తెలివిగా మసులు కోవాలని అధికారులు ఎన్ని సార్లు చెబుతున్నా బాధితులు .. కిలాడీల మెసాల ఉచ్చులో పడి వారి ఖాతాల్లోని డబ్బులను ఖాలీ చేస్తున్నారు. వీరి మెసాలకు అలర్ట్‌ గా ఉండాలని అధికారులు చెబుతున్నా అయినా సైబర్‌ క్రైం మోసాలకు తెరలేపుతున్న కేటు గాళ్ల చేతుల్లో మోసాపోకండని ఎటువంటి చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
Khalistan : అమృత్ పాల్ సింగ్ వెనుక వాళ్ల హస్తం..

Show comments