Childrens Kidnap: రాష్ట్రంలోకి చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలు ప్రవేశించాయి…ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సందేశాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హనుమకొండ, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్త స్థానిక వర్గాల్లో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్పందించారు. అయితే చిన్నారుల అపహరణ, కిడ్నాప్ ముఠాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవమని పోలీసులు కొట్టిపారేశారు. ఇలాంటి గాలి వార్తలను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు అంటున్నారు.
Read also: Money Laundering Case : హేమంత్ సోరెన్‌తో ధీరజ్ సాహుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ఇక కామారెడ్డి జిల్లాలో కూడా గత కొద్ది రోజులుగా చిన్న పిల్లలను గ్యాంగ్‌లు కిడ్నాప్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కామారెడ్డిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని కాలనీవాసులు గుర్తించగా వారిలో నలుగురు పరారయ్యారు. మరో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు సంచరిస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో జనం జంకుతున్నారు. వాటిలో కొన్ని పాత వీడియోలని పోలీసులు వివరించారు. ఇక మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చిన్నారుల కిడ్నాప్‌ల పరంపర కలకలం సృష్టిస్తోంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5 రోజుల్లోనే 3 ప్రాంతాల్లో చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇద్దరు చిన్నారులను పోలీసులు సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే కిడ్నాప్ కు గురైన వారంతా 7 ఏళ్ల లోపు చిన్నారులే కావడం సంచలనంగా మారింది. జనవరి 30న మాలపల్లికి చెందిన మహ్మద్ మిహాజ్ అనే ఏడేళ్ల బాలుడిని ఓ ముఠా కిడ్నాప్ చేసి హైదరాబాద్‌లో రూ.3 లక్షలకు విక్రయించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల ప్రత్యేక బృందాలు 4 రోజుల్లోనే బాలుడిని రక్షించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠా తిరుతుందని, పోలీసులు దీని దృష్టి పెట్టి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏది ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712685070కు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
Srisailam Darshan: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. RTC బస్ టికెట్‌తో పాటే దర్శన టికెట్ బుకింగ్..