NTV Telugu Site icon

Fake Currency Gang Busted: మైలార్ దేవ్ పల్లిలో ఫేక్ కరెన్సీ గుట్టురట్టు

Fake Currenc1

Fake Currenc1

తెలంగాణలో మళ్ళీ మళ్ళీ ఫేక్ కరెన్సీ పంజా విసురుతోంది. రంగారెడ్డి జిల్లాలో మైలార్ దేవ్‌ పల్లిలో ‌భారీగా ఫేక్ కరెన్సీ పట్టుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో నగదు చెలామణి చేస్తూ ముఠా సభ్యులు తిరుగుతుండగా పోలీసులకు చిక్కారు. చాకచక్యంగా వ్యవహరించి 5 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు మైలార్ దేవ్‌ పల్లి పోలీసులు. కాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్‌ ఎస్ఓటి పోలీసులు. వారి వద్ద నుండి లక్ష రూపాయల ఫేక్ కరెన్సీ సీజ్ చేశారు.

Read Also: Rashmika Mandanna: విజయ్ తో లిప్ లాక్.. ఆ బాధను తట్టుకోలేకపోయా

ఫేక్ కరెన్సీ నోట్లు ప్రింట్ చేయడానికి ఓ లాప్ టాప్, రెండు ప్రింటర్లు, గాంధీ emblem స్టాంపులు, గ్రీన్ పెన్లు, కట్టర్ తో పాటు ఆరు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. అత్తాపూర్ లోని ఫై ఎలక్ట్రానిక్ స్టోర్స్ లో ప్రింటర్లు కొనుగోలు, ఓ వ్యక్తి ద్వారా గాంధీ emblem తయ్యారి. యూ ట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీని తయ్యారి కి తెర లేపారు ముఠా సభ్యులు. 5 మందితో కూడిన ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కరెన్సీ తయారీకి పథకం రచించాడు A1 నిందితుడు ఆదామ్.

కాటేదాన్ లోని రద్దీ ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణికి ప్రయత్నం చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మాటు వేసి పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటి బృందం. ఆదామ్, భరత్ కుమార్, శంకర్, మాధవ గౌడ్, మణికంఠ నాయుడి పై 489 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కటకటాలకు తరలించారు. లారీ, ఆటో డ్రైవర్లు గా పని చేస్తూ ఫేక్ కరెన్సీ తయ్యారి కి స్కెచ్. ఇంజాపూర్ అడ్డా చేసుకొని ఫేక్ కరెన్సీ తయారుచేస్తూ బుక్ అయ్యారు.

Read Also: Rashmika Mandanna: విజయ్ తో లిప్ లాక్.. ఆ బాధను తట్టుకోలేకపోయా