NTV Telugu Site icon

Fake Certificates: భారీసంఖ్యలో ఫేక్ సర్టిఫికెట్లు సీజ్

డబ్బులుంటే చాలు.. కాలేజీకి వెళ్లక్కర్లేదు. కష్టపడి పరీక్షలు రాయాల్సిన పనిలేదు. మీకే యూనివర్శిటీ సర్టిఫికెట్ కావాలంటే అది మీ ఇంటికే వచ్చి చేరుతుంది. తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం రచ్చరేపుతోంది. నకిలీ సర్తిఫికెట్లు సృష్టిస్తున్న వారితో పాటు నకిలి సర్టిఫికేట్లు కొన్నవారిని ..8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి భారి సంఖ్యలొ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

సంతోష్ నగర్ కి చెందిన సయ్యద్ నవీద్ ఉరఫ్ ఫైసల్, యాదగిరి థియేటర్ సమిపంలో ఎం.హెచ్ కన్సల్టెన్సీ పేరుతో ఆఫీస్ తెరిచాడు. ఆర్ధికంగా ఎదగలేకపోయాడు. ఆ కార్యాలయాని అక్కడే ఆపి, బషీర్ బాగ్ ప్రాంతం లొ క్యూబేజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్విస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నూతనంగా ఆఫీసు తెరిచాడు. విదేశాలకు వెళ్లి విద్యాభ్యాసం చేయాలనుకునేవారిని టార్గెట్ చేశాడు. వీసాతో పాటు అత్యధిక ర్యాంకుతో పాటు మంచి మార్కులు ఉన్న సర్టిఫికెట్లు తయారు చేయించాడు. బాగా డబ్బు సంపాదించాలన్న దురాశతో మీర్ చౌక్, మీరాలం మండికి చెందిన డీటీపీ వర్కులో ప్రావీణ్యం ఉన్న సయ్యద్ నవీద్ తో పాటు, జమాల్ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్రార్ ఉద్దీన్ తో జతకట్టాడు.

ఈ ముగ్గురు నకిలీ సర్టిఫికెట్ల తయారీలో సహాయపడ్డారు. తక్కువ మార్కు ఉన్న వాటి పై ఎక్కువ మార్కులుగా, ఫెయిల్ అయిన వారి సర్టిఫికెట్లను పాసయినట్టుగా అధిక మార్కులకు మార్చి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుండి 70 నుంచి 80 వేల రూపాయలు తీసుకుని నకిలీ సర్తిఫికెట్లు తయారుచేసి ఇచ్చేవారు. నకిలీ సర్టిఫికెట్ల సమాచారం సేకరించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు ఇన్ స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర ఆధ్వర్యంలో సంతోష్ నగర్ పోలీసులతో కలిసి దాడులు చేశారు.

ఈ ముగ్గురితో పాటు నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న సంతోష్ నగర్ కు చెందిన అబ్దుల్ రహీం, అబ్దుల్ కరీం, ఇస్మాయిల్ అహ్మద్, నసీర్ అహ్మద్, కామారెడ్డికి చెందిన ఫైసల్ బిన్ షాదుల్లా ను అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన ఎస్ఎస్ సీ, మహారాష్ట్ర ఇంటర్, ఉస్మానియా యూనివర్సిటి డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటి బీటెక్, తెలంగాణ యూనివర్సిటి డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లుతో పాటు సింబియాసిస్ ఇంటర్నేషనల్, డీమ్డ్ యూనివర్సిటీ పూణె కి చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.