Site icon NTV Telugu

Face to Face with KTR : షర్మిలది.. అత్తమీద కోపం దుత్తమీద..

తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఎన్టీవీ ఫేస్‌ టు ఫేస్‌ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చన్నారు. అయితే దేని కోసం ఎక్కడ చేస్తున్నామన్నది ముఖ్యమని.. షర్మిలది అత్మ మీద కోపం దుత్తమీద అన్నట్లు.. అన్న మీద కోపం ఉంటే.. అక్కడ చూసుకోవాలి గానీ.. ఇక్కడేంటని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌ బ్రతికున్నంత వరకూ తెలంగాణ వ్యతిరేకని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిలా కాంట్రిబ్యూషన్‌ ఏముందని ఆయన ప్రశ్నించారు.

అంతేకాకుండా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, షర్మిలా లాంటి వారు ఎవరి ఏజెంట్లో ప్రజలు తెలుసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌కు బడుగు, బలహీన వర్గాల్లో ఉన్న నమ్మకాన్ని, పట్టును పొగోట్టేందుకే ఈ శిఖండిలాంటి వాళ్లను ఊసిగొల్పుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని చేసినా ప్రజల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని పొగొట్టలేరన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, షర్మిలా లు బీజేపీ ప్రభుత్వంపై ఎందుకు గొంతు ఎత్తడం లేదో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, అన్ని రాష్ట్రాల్లో చేసినట్లు బీజేపీ ఇక్కడ చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరన్నారు.

Exit mobile version