తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.. చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది.. ఇదే సమయంలో.. మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. అంతేకాదు.. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.. కాగా, ఇప్పటికే తెలంగాణలో కురిసిన వర్షాలతో పంటలకు భారీ నష్టమే జరిగింది.. పంట నష్టాన్ని అంచనావేసే పనిలో ఉన్నారు అధికారులు.. ఈ సమయంలో.. మరోసారి వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.
తెలంగాణకు వర్ష సూచన.. మూడు రోజులు వర్షాలే..!
