Site icon NTV Telugu

తెలంగాణ నైట్ కర్ఫ్యూ: వీటికి మినహాయింపులు…  

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఈరోజు నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది.  అయితే, ఈరోజు రాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.  కర్ఫ్యూ అమలు సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి.  ఎల్పీజీ, సిఎన్జీ, గ్యాస్, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు యధావిధిగా నడుస్తాయి.  నీటి సరఫరా, పారిశుధ్యం పనులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.  
ఐటితో పాటుగా ఐటి అనుబంధ సేవలకు మినహాయింపులు ఇచ్చారు.  ఈ కామర్స్ యాప్స్ ద్వారా జరిగే ఆహార పదార్ధాల పంపిణీకి మినహాయింపు.  ఆసుపత్రులు, ల్యాబ్ లు, మెడికల్ షాపులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.  

Exit mobile version