NTV Telugu Site icon

Cess Election Results: సెస్ ఫలితాలపై ఉత్కంఠ.. కేటీఆర్,బండి సంజయ్ పర్యవేక్షణతో ప్రాధాన్యత

Ktr Bandi Sanjay

Ktr Bandi Sanjay

Cess Election Results: తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ వేడి మామూలుగా ఉండదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సెస్ ఎన్నికలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలే కాదు ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఈ రాజకీయ వేడి కనిపిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి.

Read also: Afghanistan: ఆఫ్ఘన్‌లో మహిళా విద్యార్థుల నిరసన.. తరగతులు బహిష్కరించిన విద్యార్థులు

వేములవాడ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 15 డైరెక్టర్ స్థానాలకు 75 మంది పోటీ పడగా, 87 వేల 130 మంది ఓటర్లలో 73189 మంది ఓటు వేశారు. వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి ఏడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గానికి 8 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 స్థానాలకు గానూ తక్కువ ఓట్లు వచ్చిన రుద్రంగి వీర్నపల్లి స్థానాల్లో తొలి ఫలితం రానుంది. 26 పోలింగ్ బూత్‌లు ఉన్న ఇల్లంతకుంట బోయినపల్లి మండలాల్లో 13 రౌండ్ల ఫలితాలు రానున్నాయి. సెస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపు జరగనుండగా.. సెస్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షణలో సెస్ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read also: Droupadi Murmu: తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే..

రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సహకార విద్యుత్ సరఫరా సంస్థ (ఎస్ఈఎస్) ఎన్నికల శంఖారావం, సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి సెస్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు నామినేషన్లు, 16న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన, మార్కుల కేటాయింపు, డిసెంబర్ 24న ఎన్నికలు, 26న ఓట్ల లెక్కింపు, డిసెంబర్ 27న విజేతల ఫలితాల వెలువడనున్నాయి. తెలంగాణ సహకార ఎన్నికల అథారిటీ పాత డైరెక్టర్‌షిప్‌ల ప్రకారం 11 డైరెక్టర్‌షిప్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పెర్కొన్న విషయం తెలిసిందే..

Read also: Tirumala Vykunta Dwara Darshan: టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ .. ఎక్కడంటే?

ముఖ్యంగా సెస్సు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే రాజకీయాలు సాగాయి.. ఈ ఎన్నికలకు ఎన్నికల కోడ్ లేకపోవడంతో గురు, శుక్ర వారాల్లో కూడా ప్రచారం జోరుగా సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిరిసిల్లలో పర్యటించి సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఓటర్లతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తనను చూసి ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Top Headlines @9AM: టాప్ న్యూస్