Site icon NTV Telugu

Ex MLA Shakeel Son Arrest: షకీల్ కుమారుడు రహిల్ అరెస్ట్.. ఈనెల 22 వరకు రిమాండ్..!

Shakeel Sun Raheel

Shakeel Sun Raheel

Ex MLA Shakeel Son Arrest: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహేల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న రహేల్‌ను పోలీసులు కాపుకాచి శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాహేల్ ను పోలీసులు న్యాయమూర్తి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అంతా ఘటనలు పరిగణలోకి తీసుకున్న జడ్జి ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి రహేల్‌ను చెంచల్ గూడ జైలుకు తరలించారు. యాక్సిడెంట్ కేసులో రహేల్ నిందితుడైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా రహేల్ కోసం పోలీసులు గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు ఇవాళ అదుపులో తీసుకున్నారు.

Read also: Indian Army: ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌ కోసం కొత్త బోర్డులు.. అధికారుల కొరతకు చెక్‌!

కాగా, ప్రగతి భవన్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో రహేల్ దుబాయ్ కి పారిపోయాడు. దీంతో పోలీసులు ఇప్పటికే రహేల్‌కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా పంజాగుట్ట పోలీసులు రహేల్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రగతి భవన్‌లో జరిగిన ప్రమాదంలో తనను తప్పించేందుకు రహేల్‌కు బదులు ఇంట్లో పనిచేసే మరో వ్యక్తి కారు నడిపినట్లు నిందితుడు చూపించాడు. కాగా.. అసలు నిందితుడిని రహేల్‌గా పోలీసులు గుర్తించారు.

Read also: Yash Thakur-IPL 2024: ఐపీఎల్‌ 2024లో లక్నో బౌలర్ల హవా.. యశ్‌ ఠాకూర్ అరుదైన రికార్డు!

డిసెంబర్ 23, 2023 తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ (ప్రస్తుతం ప్రజా భవన్) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టి ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్ ఈ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అతడు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడంతో నిందితుడు తప్పిపోయాడా లేక ఎవరైనా తప్పించుకున్నారా అనే కోణంలో విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు నిందితుడు రహీల్ అని తేల్చారు.

MLC Kavitha: కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పు..

Exit mobile version