NTV Telugu Site icon

Rasamayi Balakishan: ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచిండు

Rasamayi Balakrishna

Rasamayi Balakrishna

Karimnagar: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానకొండుర్ నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తిమ్మపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో హాల్లో జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యానారాయణపై మండిపడ్డారు.

Also Read: High Court: “నలుపు రంగులో ఉందని భార్యకు విడాకులు”.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

దొంగ మాటలు చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచాడని, తాను ఎమ్మెల్యేగా ఉన్న పది సంవత్సరాలు ఏ రోజూ కూడా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మర్యాద ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతిరోజూ తనని వాడు విడు అంటూ అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గెలిచిన కవ్వంపల్లి సత్యనారయణ బ్రోతల్ కొంపలు నడిపి డబ్బులు సంపాదించిండా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఎమ్మెల్యే తన తీరు, భాష మార్చుకోకపోతే తాను కూడా ఆ దారిలోకి వెళతానని, ఇకపై ఎమ్మెల్యేపై అదే మాటలు మాట్లాడుతానంటూ వ్యాఖ్యానించారు.

Show comments