Site icon NTV Telugu

పోలీసులకు కూడా మనసులో నేను గెలువాలని ఉంది : ఈటల

etela rajender

etela rajender

ప్రజా దీవెన పాద యాత్రలో భాగంగా నేడు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మంత్రులకే దొరకని సీఎం ఎంపీటీసీ, సర్పంచ్ లతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మన దెబ్బ అలా ఉంది అన్నారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యే లు నా మీదకు వస్తున్నారు. ఇది గడ్డి పోస కాదు, గడ్డపార. పొలిసులకు కూడ వారి మనసులో ఈటెల రాజేందర్ గెలువాలని ఉంది. నేను అందరికి సహాయం చేసే వాడిని. నాకు కష్ట కాలం వచ్చింది. పార్టీలు, జెండాలు పక్కకు పెట్టండి. నన్ను ప్రేమించిన, ద్వేషించిన వారికి పని చేసి పెట్టాను. నాకు మనిషిలో ఓటు కనపడలే, మానవత్వం కనిపించింది అని తెలిపారు. కానీ కేసీఆర్ కి మనిషి కనిపించడు, ఓటు మాత్రమే కనిపిస్తది. అది వాళ్ళ సంస్కారం. ఆలోచన కుర్చీ, ఆశయం పవర్ అన్నారు. ఫీల్డ్ అసిస్టంట్ల కంట్లో కేసీఆర్ మట్టి కొట్టిండు. నాకు మీరు అందరు అండగా నిలువాలి. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్లు ఉంది కేసీఆర్ పని. అధికారంలో ఉన్నవారు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అని పేర్కొన్నారు.

Exit mobile version