RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ మీద సీసీఎస్ లో కేసు నమోదైంది. ఖాజాగుడాలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 గుంటల భూమి విషయంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ భూమి తమదే అని ఆర్పీ సింగ్, ఆయన భార్య హారవిందర్ సింగ్ చెబుతున్నారు. ఈ భూమిని గతంలో ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు. 3ఎకరాల 24 గుంటల భూమి గిఫ్ట్ డీడ్ చేసినట్లు గా ఐ టవర్ నిర్మాణ సంస్థ గుర్తించింది. కాకపోతే ఈ గిఫ్ట్ డీడ్ ను హరవింద్ కౌర్ క్యాన్సిల్ చేశారు. తన కూతురు అమెరికాలో ఉందనే కారణంతో దీన్ని క్యాన్సిల్ చేశారు. కానీ ఈ విషయాన్ని ఆయన దాచిపెట్టి డెవప్ మెంట్ కోసం ఇచ్చారని ఐటవర్ సంస్థ 2023 లో రాయదుర్గం పోలీస్ కు ఫిర్యాదు చేసింది.
Read Also : Baahubali : బాహుబలి రన్ టైమ్ పై రానా క్లారిటీ..
ఐ టవర్ సంస్థ బ్యాక్ లోన్ కోసం వెళ్లినప్పుడు బ్యాంక్ అధికారులు ఈ విషయాలను బయట పెట్టారు. కానీ అప్పటికే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో 700 మంది కస్టమర్లు ప్లాట్లను కొనేశారు. ఇటు లోన్ రాకపోవడంతో కమర్షియల్ కాంప్లెక్స్ పూర్తి కాలేదు. 700 మంది భాదితులు మోసపోయారు. ఈ విషయంపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్పీ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆల్రెడీ చాలా మంది డబ్బులు చెల్లించేశారు. ఇప్పుడు తమకు ప్లాట్లు వస్తాయా రావా అన్న టెన్షన్ వారిలో పెరుగుతోంది.
Read Also : War 2: వార్ 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్
