BIG breaking: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయపడ్డారు. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే గురువారం అర్ధరాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారి పడిపోయినట్లు సమాచారం. దీంతో మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోని అర్ధరాత్రి బాత్‌రూమ్‌లో జారి పడిపోయినట్లు సమాచారం. బాత్ రూమ్ కు వెళుతుండగా కేసీఆర్ పంచె కాలుకు తగిలి కిందికి పడిపోయినట్లు విశ్వనీయ సమాచారం.
Read also: World Deepest Lab: భూమి నుంచి 2.5కి.మీ లోతులో ప్రయోగశాలను నిర్మిస్తోన్న డ్రాగన్ కంట్రీ ?
ఈ క్రమంలో కేసీఆర్ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిని సోమాజిగూడలోని యశోదకు ఆస్పత్రికి అర్థరాత్రి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
World Deepest Lab: భూమి నుంచి 2.5కి.మీ లోతులో ప్రయోగశాలను నిర్మిస్తోన్న డ్రాగన్ కంట్రీ ?