Distribution of EVMs: కామారెడ్డి, జహీరాబాద్ లో భారీ వర్షానికి ఈవీఎం పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. అయితే కామారెడ్డిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో వాన భారీగా పడతుండటంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ కోసం ఏర్పాట్లపై అంతరాయం చోటుచేసుకుంది. వర్షానికి టెంట్లో నుంచి నీరు కురుస్తుండటంతో.. పోలింగ్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. వానతో పాటు ఈదురు గాలులకు టెంటు కూలడంతో.. సిబ్బంది ఈవీఎం ప్యాడ్లు తడవకుండా అవస్థలు పడుతున్నారు. మరోవైపు జహీరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి EVM పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. EVM మెషీన్లు, కంట్రోలింగ్ యూనిట్లపై వర్షపు నీరు పడుతుండటంతో.. ఈవీఎం ప్యాడ్లు తడవకుండా కాపాడుకునేందుకు ఎన్నికల సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.
Read also: Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్ కింద దర్శనమిచ్చిన ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు
హైదరాబాద్ వాతావరణ శాఖ ముందుగానే వానల గురించి వెల్లడించినా ఎన్నికల అధికారులు పెడచెవిన పెట్టారని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటు చేసిన టెంట్లలో నుంచి నీరు కారుతుండటంతో తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయని, అధికారులు దీనికి అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. హైదరాబాద్ లో వాతావరణం ఉదయం నుంచి ఎండ మండుతుంది. సాయంత్రం నుంచి వాతావరణం మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం, రేపు కూడా భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా ఓటర్లు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Viral Video: అసలు ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. కారులోనే దుకాణం పెట్టేసిన ఘనుడు..