NTV Telugu Site icon

Railway SP AnuRadha: సికింద్రాబాద్ అల్ల‌ర్ల విధ్వంసంలో.. మ‌రో ముగ్గురు

Railway Sp Anuradha

Railway Sp Anuradha

సికింద్రాబాద్ రైల్వేస్టేష్‌ విధ్వంసం కేసులో సూత్రధారి అయిన సుబ్బారావు అరెస్టుతో కీలక అంశాలు వెలువ‌డుతున్నాయి. సుబ్బారావుతో పాటు ముగ్గురు అనుచరులు అరెస్ట్ చేశారు పోలీసులు. రైల్వే ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. ఆవుల సుబ్బారావుతో పాటు అకాడమీ ఉద్యోగులు మరో ముగ్గురు అరెస్టే చేసినట్లు తెలిపారు. అకాడమీ ఉద్యోగులు శివ కుమార్, మల్లారెడ్డి, బీసీ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు వివరించారు. నలుగురు పై రైల్వే యాక్ట్ తో పాటు 26 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారని వెల్లడించారు. వ్వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి విధ్వసం సృషించే విధంగా ప్లాన్ చేశారన్నారు.

సికింద్రాబాద్ అల్లర్ల తర్వాత సాక్ష్యాలను సుబ్బారావు తారుమారుచేసేందుకు ప్రయత్నించాడని అన్నారు. విద్వాసం కు ముందు రోజు నర్సరావుపేట నుండి హైదరాబాద్ వచ్చిన సుబ్బారావు.. బోడుప్పల్ లోని SVM గ్రాండ్ లాడ్జ్ లో ఉండి విద్వాసం టీవీలో చూసి సంతృప్తి పొందినట్లు నిర్దారించారు. అనుచరులు పంపిన వాట్సప్ గ్రూప్ మెసేజ్ లను డీలేట్ చేయమని చెప్పి.. గ్రూప్స్ లో ఉంది ఏక్సిట్ అవ్వమని సుబ్బారావు చెప్పినట్లు.. బ్యాన్సర్ల కోసం 35 వేలు ఖర్చు చేసినట్లు తేచ్చామని రైల్వే ఎస్పీ అనూరాధ తెలిపారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌కు చెందిన ఇద్దరు అకాడమీ డైరెక్టర్లు ఉన్నారని వెల్ల‌డించారు. కాగా.. మరో ఇద్దరు మల్లారెడ్డి, శివసాయి డిఫెన్స్‌ అకాడమీ ఉద్యోగులు, రెడ్డప్ప, హరి సహా మరొకరు ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొన్నట్లు గుర్తించామ‌ని తెలిపారు. 12 మంది అకాడమీ అభ్యర్థులతో 8 వాట్సాప్‌ గ్రూప్‌ల ఏర్పాటు చేసి.. ప్లాన్ ప్ర‌కార‌మే విధ్వంసానికి కుట్ర చేశారని విచార‌ణ‌లో వెల‌డించార‌ని పేర్కొన్నారు. ఈ 8 వాట్సాప్‌ గ్రూపుల్లో 2 వేల మంది ఆందోళనకారులు ఉన్నారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు.

Kakinada JNTU : ఇంటారాక్షన్‌ పేరుతో ర్యాగింగ్‌.. 11 మంది విద్యార్థులు సస్పెండ్‌..