NTV Telugu Site icon

Adilabad: ఆదిలాబాద్ లో ఎంపి ఎన్నికల ఓట్ల లెక్కింపు కు సర్వం సిద్ధం..

Adilabad

Adilabad

Adilabad: ఆదిలాబాద్ జిల్లా లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడుచోట్ల ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రం (టీటీడీసీ)లో ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా పరిధి లోని ఖానాపూర్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాలలో నిర్వహించనున్నారు. కొమరం భీం జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, సిర్పూర్ టీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలవిద్యాలయంలో కొనసాగనుంది.

Read also: BJP: బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా.. 1984 కాంగ్రెస్ రికార్డును పునరావృతం చేస్తుందా..?

ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న లోక్ సభ ఓట్ల లెక్కింపు షురూ కానుంది. 1100 మందితో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 156 రౌoడ్లలో కొనసాగనున్న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్ పై 14 ఈవీఓంలను అధికారులు లెక్కించనున్నారు. మొత్తం ఓట్లు 16,50,175 ఓట్లకు గాను పోలైన ఓట్లు 12,21,583 కాగా.. 74.03 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం ఏడు కౌంటింగ్ హాల్స్..ప్రతి కౌంటింగ్ హాల్ లో 14 టేబుళ్ల ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లో 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది… ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంటు, మైక్రో అబ్జర్వర్ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. గంటకు నాలుగు రౌండ్లు పూర్తవుతాయి. ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే రౌండ్ల వారీగా ఓట్లను క్రోడీకరించి ఫలితం ప్రకటిస్తారు.

Read also: Mallikarjun Kharge : ఎన్నికల ఫలితాలు.. బ్యూరోక్రాట్లకు లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే.. ఏం చెప్పారో తెలుసా?

నియోజకవర్గం, పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు ఓట్లు, రౌండ్లు

సిర్పూర్-320- 1,63,944.23
ఆసిఫాబాద్-356- 1,71,511.23
బోథ్ -306- 165157.22
ఆదిలాబాద్-292-181136.21
ఖానాపూర్-309-1,62,101.22
ముథోల్-306-1,85,168.22
నిర్మల్-311-1,92,546.22


Parliament Elections 2024: కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు..