NTV Telugu Site icon

Medak: లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం..

Medak

Medak

Medak: మెదక్ జిల్లాలో లోక్ సభ ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మొత్తం 18 లక్షల 28 వేల 210 ఓట్లకు గాను పోలైన 13 లక్షల 72 వేల 894 ఓట్లు కాగా.. మెదక్ నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. రెండు చోట్ల మెదక్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. నర్సాపూర్ అల్లూరి గురుకులంలో సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. BVRIT ఇంజనీరింగ్ కాలేజీలో మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గ ఓట్ల లెక్కించనున్నారు.

Read More:Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

అత్యధికంగా పటాన్ చెరు సెగ్మెంట్ కి 18 టేబుళ్లు, గజ్వేల్ కి 15, మిగిలిన ఐదు నియోజకవర్గాలకు 14 చొప్పున మొత్తం 103 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పటాన్ చెరు ఫలితం 23 రౌండ్లు, నర్సాపూర్, గజ్వేల్ 22, సంగారెడ్డి 21, మెదక్, సిద్దిపేట 20, దుబ్బాక 19 మొత్తం 147 రౌండ్లలో పూర్తి ఫలితాలు రానున్నాయి. ముందుగా పోలైన 14, 297 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రెండు రౌండ్లలో లెక్కించనున్న అధికారులు. 199 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణలో ఉండనున్నాయి. 10 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 45 మంది ఎస్సైలతో మొత్తం 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Khammam: లోక్​ సభ కౌంటింగ్ కు అంతా రెడీ.. స్ట్రాంగ్ రూమ్​ ల దగ్గర మూడంచెల భద్రత