Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్ నగర శివార్లలో మినీ సిటీ.. నిర్మించేందుకు సిద్ధమైన HMDA..!

Hyderabad City

Hyderabad City

Hyderabad: హైదరాబాద్ నగరం గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలకు, ముఖ్యంగా టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఎక్కడి నుంచి వచ్చినా హైదరాబాద్ మహానగరం ఘనంగా స్వాగతం పలుకుతుంది. కాబట్టి హైదరాబాద్ జనాభా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం ఉన్న జనాభాతో ట్రాఫిక్ సమస్యలు మరియు కాలుష్యం ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ కష్టాలు పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు.. హైదరాబాద్ నగర శివార్లలో మినీ సిటీల నిర్మాణానికి హెచ్ ఎండీఏ సిద్ధమైంది. కాగా, ఈ విషయమై గత ప్రభుత్వానికి అధికారులు తమ ప్రతిపాదనను వెల్లడించారు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ శివార్లలో కొత్త నగరాలను నిర్మించడం ద్వారా నగరంలో రద్దీ, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు కూడా మెరుగుపడతాయి. ఈ క్రమంలో నగర శివార్లలోని 11 ప్రాంతాల్లో మినీ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

Read also: Vijay Deverakonda: అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఫస్ట్ రివ్యూ..అద్భుతం అంటున్న దేవరకొండ

ఈ క్రమంలో ఇబ్రహీం పట్నం, తుర్కపల్లి ప్రాంతాలను మినీ సిటీలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో బ్యాంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ నిర్మిస్తే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు హైదరాబాద్ కు రావాల్సిన అవసరం తగ్గుతుంది. కానీ ఈ నగరాల అభివృద్ధికి అవసరమైన నిధులను పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిగల పార్టీల నుంచి టెండర్లు పిలవాలని హెచ్‌ఎండీఏ సూచించింది. ఇప్పటికే పలు అంశాల కారణంగా… నగర శివార్లలో… నగర భూములకు డిమాండ్ అంతంత మాత్రంగానే సాగుతోంది. భూమిని కొనుగోలు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని వల్ల భవిష్యత్తులో భూమి కొనుగోలు కష్టమవుతుంది. కాబట్టి మినీ సిటీల నిర్మాణానికి ఇదే సరైన సమయమని అధికారులు భావిస్తున్నారు. అయితే నగర శివార్లలో మినీ సిటీలను నిర్మించడం ద్వారా నిజంగానే హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గుతుందనే చెప్పాలి.
Inter Practical 2024: తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్.. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు..

Exit mobile version