Harish Rao: దళిత బందులో కూడా జర్నలిస్ట్ లకు అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇండ్ల పట్టాలు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని పేర్కొన్నారు. 300 మందికి నేడు పట్టాలు పంపిణీ చేస్తున్నాం , త్వరలోనే అందరితో కలిసి సామూహిక గృహ ప్రవేశం చెద్దామన్నారు.
Read also: Dance Icon: ఆహా ‘డాన్స్ ఐకాన్’ విన్నర్స్ అసిఫ్, రాజు
ఈ ఇండ్లు సుమారు 20 లక్షల రూపాయిలు విలువ ఉంటాయని అన్నారు. ఇవి ఎవరు అమ్మకూడదని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే మరో వెయ్యి ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. గతంలో లబ్ది పొందని పేద జర్నలిస్టుల కోసం మూడు బ్లాక్ లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దళిత బందు లో కూడా జర్నలిస్ట్ లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. స్వంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి త్వరలోనే నిధులు ఇస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Megastar: గోవాలో ల్యాండ్ అయిన మెగాస్టార్