NTV Telugu Site icon

Etela rajender: హుజురాబాద్ లో చర్చకు నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? సీఎంకు ఈటెల సవాల్‌..

Etala Rajender, Cm Kcr

Etala Rajender, Cm Kcr

Etala rajender: హుజూరారాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వందల కోట్లు ఎక్కడివి? అని హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ సంచలన వాఖ్యలు చేశారు. నా మాటలపై అబిడ్స్ లో లేదా హుజురాబాద్ చర్చ పెట్టుకుందామా అని సవాల్‌ విసిరారు. నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అక్రమ కేసులకు నిరసనగా కరీంనగర్‌ జిల్లా బీజేపీ ధర్నాలో ఈటెల పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కోట్లు పంచారని మండిపడ్డారు. ఆ డబ్బుల్ని మానేరు నదిలో ఇసుకను తరలించి దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ తోడల్లుడికి తనుగుల చల్లూర్ లాంటి గ్రామాల్లో ఇసుక క్వారీలు కట్టబెట్టి వందలకోట్ల విలువ చేసే ఇసుక కొల్లగొడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ దళిత భూములపై కేసీఆర్ కన్ను పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం కట్టారు దానికి సెల్యూట్ చేసి వస్తా అని అన్నారు. అంబేద్కర్ కు దండ వేయకుండా అడ్డుకున్నది నువ్వుకాదా? అని ప్రశ్నించారు. విగ్రహం పెట్టగానే అయిపోదన్నారు.

అంబేద్కర్ రాజ్యాంగం పనికి రాదు మార్చాలని అన్న నీకు రాజ్యాంగ నిర్మాతకు దండేసే హక్కులేదని ఆరోపించారు. జిప్పు తీసి చూపించిన వాళ్లు, రాళ్లతో కొట్టిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారని, నిజమైన తెలంగాణ బిడ్డలు నీ వెంట లేరని మండిపడ్డారు. సీఐ నువ్ చిన్న మనిషివి బిడ్డా నీ బతుకు ఎందో సంవత్సర కాలంలోనే చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదేమైన నిషేధించిన పార్టీనా? ఊదితే కొట్టుకు పోతారు.. నేను గెలిచిన ఎమ్మెల్యే ను ఇక్కడ? ఓడిపోయిన వాళ్ళు హుజురాబాద్ లో లీడర్లు అయిపోయారని మండిపడ్డారు. అహంకార పూరితంగా వ్యవవహరించిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎంని సస్పెండ్ చేసే వరకు ధర్నా కొనసాగుతోందని అన్నారు. సర్పంచ్ మహేందర్ కేసీఆర్ డబ్బులకు అమ్ముడు పోకుండా సైకోలకు బెదరలేదన్నారు. ఉప ఎన్నికల్లో బెదరని వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వీణవంకలో వేరే పార్టీ జెండాలు ఉండవద్దట అన్నారు. అరే కొడకా నువ్ చిన్న మనిషివి రా ? అని ప్రశ్నించారు.

వేల ఎకరాల భూమి ఉన్నోడికి రైతు బందు ఎలా ఇస్తావ్ అన్నందుకు మెడలు పట్టి బయటకు వెల్లగొట్టాడని ఆరోపించారు. నా సంపాదన మీద ఉక్కు పాదం మోపావ్.. 20ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక మీద ఎవరిని ఎంటర్ కనియ్యలేదన్నారు. మానేరు నది చేర బట్టి… కేసీఆర్ బంధువులు మేసిన్లు పెట్టి ఇసుకను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఎవడ్రా కొడకా? మా సొమ్ముతో నువ్ బతుకుతున్నావ్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో 2006 నిలబడిన నాడు… ఆనాటి ప్రభుత్వం నిన్ను ఓడగొట్టాలని రాజశేఖర్ రెడ్డి కోట్లు పంచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేయమని అన్నావ్ కదా కేసీఆర్.. 8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వందల కోట్లు ఎక్కడివి? అని ప్రశ్నించారు. మా నోరు…కడుపు కొట్టి అక్రమంగా సంపాదించిన డబ్బు బెంగాల్,బీహార్ పంపిస్తావ్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. నా మాటలపై అబిడ్స్ లో లేదా హుజురాబాద్ చర్చ పెట్టుకుందామా అని సవాల్‌ విసిరారు. నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? అంటూ వ్యంగాస్త్రం వేశారు. ప్రాణానికి వేళ కట్టే మూర్ఖపు నాయకుడివి నువ్ కేసీఆర్ అని మండిపడ్దారు.

డబుల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి అవ్వలేదన్నారు. దళిత బందు పూర్తిగా ఇవ్వలేదని, 10లక్షల రూపాయలు దళిత బిడ్డల పంచె వరకు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టవద్దన్నారు. మునుగోడులో గిరిజన బందు అన్నాడు అయినా ఇంత వరకు జి.ఓ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ దళిత బిడ్డలకి అందరికి దళిత బందు రాకపోతే నీ భరతం పడత అని మండిపడ్డారు. చదువుకున్నోడికి నౌకరి వస్తది అనుకున్న…డబ్బులు ఉన్నోడికి వస్తున్నాయని ఆరోపించారు. పేపర్ లీకేజీ పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీ చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. నందిపేట ఊరిలో సర్పంచ్ దంపతులు పెట్రోల్ పోసుకొని తగలబడతా అని పోయారని తెలిపారు. సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల బాధలో ఇరుక్కు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శిలను ఏమి రా అంటున్నాడు.. మీ నాయకులకు పద్ధతి నేర్పు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ముందు మూడు… వెనక మూడు పోలీస్ వాహనాలు పెట్టుకొని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకోమన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Puvvada Ajay Kumar: కేసీఆర్ చెయ్యి వదిలిన వారంతా శంకరగిరి మాన్యాలకు పోతారు